నాడు
‘ప్రతి పేద వాడు ఉన్నత చదువులు చదువుకోవాలి. ప్రతి ఇంటి నుంచి పెద్దపెద్ద ఇంజినీర్లు, డాక్టర్లు బయటకు రావాలి. వారి ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా చర్యలు చేపట్టాలి. ఎన్ని అడ్డంకులున్నా విద్యాభివృద్ధికి పెద్దపీట వేయాలి..’ అన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. గతంలో కార్పొరేట్‌కు సాగిలపడిన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. రుచికరమైన జగనన్న గోరుముద్ద.. ఆహ్లాదకరంగా ఉండేందుకు నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు సర్వోన్నతంగా తీర్చిదిద్దింది. ప్రస్తుత సాంకేతికరంగంలో పేద పిల్లలు కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా డిజిటల్ బోధనకు మెరుగులు అద్దింది. బైజూస్‌తో కూడిన ట్యాబులు.. క్లాస్ రూమ్‌ల్లో డిజిటల్ పాఠాలకు బీజం వేసింది. విద్యార్థుల తల్లలకు అమ్మఒడి పేరుతో ఆర్థిక చేయూతనందించింది. వసతి దీవెన, విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉచిత చదువులకు శ్రీకారం చుట్టింది. పేదలపై ఎలాంటి భారం లేకుండా చదువులు సాగేలా చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment