రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నాయుడుపేటటౌన్ : మండల పరిధిలోని తిమ్మాజి కండ్రిగ– చవివేంద్ర గ్రామాల సమీపంలో కూడలి వద్ద రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ నడుపుతున్న బత్తల మనోజ్ కుమార్(27) మృతి చెందాడు. సీఐ బాబి తెలిపిన వివరాల మేరకు.. మేనకూరు వైపు నుంచి బైక్‌లో వస్తున్న మనోజ్‌కుమార్ ముందు వెళుతున్న కారును అధిగమించిబోయి అదుపు తప్పి ఎదరుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మనోజ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
తిరుచ్చిపై వెంకన్న విహారం
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారు శనివారం సాయంత్రం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లకు కనుల పండువగా కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ జరిపించారు. అనంతరం సర్వాలంకార శోభితులైన దేవదేవేరులను తిరుచ్చిపై కొలువుదీర్చారు. నాలుగు మాడవీధులలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ వల్లంశెట్టి రమేష్ బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ ధనశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment