ఆదిఆంధ్ర అంటే మాదిగలే!
తిరుపతి అర్బన్: జిల్లాలో ఆదిఆంధ్ర పేరుతో ఉండే ఎస్సీలు మాదిగ కులానికి చెందినవారేనని ఎంఆర్‌పీఎస్ జాతీయ నేతలు నరేంద్రబాబు మాదిగ, పులికుంట్ల గోపి మాదిగ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సందర్భంగా ఎంఆర్‌పీఎస్‌కు చెందిన నేతలు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను కలిశారు. వారు మాట్లాడుతూ ఎస్సీ కులానికి చెందిన వారు ఎస్సీ–ఏ, ఎస్సీ–బీ, ఎస్సీ–సీ, ఎసీ–డీగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో మాలలు ఎస్సీ–సీలోను, మాదిగలు ఎస్సీ–బీలో ఉన్నారని తెలిపారు. అయితే తిరుపతి జిల్లాలో ఆది ఆంధ్ర పేరుతో మాదిగలను ఎస్సీ–డీలో ఉంచారని ఆవేదన చెందారు. ఆది ఆంధ్రకు చెందిన వారు మాదిగలేనని వారిని ఎస్సీ–బీలో చేర్చాలని కోరారు. ఎంఆర్‌పీఎస్ నేతలు వాసుదేవరావు, వేలూరు రాజేంద్ర, వావిళ్ల శివయ్య, నవీన్‌కుమార్, పరమాల మునువేలు, బోయినపల్లి రవి, సంగీతం రామ్మూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment