శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి కల్చరల్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున తిరుప్పా వై సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, అర్చన, శ్రావణ తిరుమంజనం, శుద్ధి నిర్వహించారు. అనంతరం 6.30 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేశారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. తర్వాత భక్తులను ఉదయం 9.30 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఏపీ శ్రీనివాస దీక్షితులు, ఏఈఓ కె.మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment