తిరుపతిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’
సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ ఆదివారం తిరుపతిలో సందడి చేసింది. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
అధికారాలకు చెల్లుచీటీ
కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. అందుకు ఇదే నిదర్శనం. గ్రామ సర్పంచ్‌ల అధికారాలకు నిలువునా తూట్లు పొడుస్తోంది. గ్రామాల్లో గతంలో సర్పంచ్ తీర్మానాల మీదనే అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉండేది. ఇప్పడు అందుకు విరుద్ధుంగానే పనులు చేస్తున్నారు. ఇక సర్పంచ్‌లు ఎందుకు?.
–గుంటమడుగు గీతాంజలి, సర్పంచ్, రాజులఎరుగుంటపాళెం, సైదాపురం మండలం, వెంకటగిరి నియోజకవర్గం
విలువ లేదు
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సర్పంచ్‌ల ప్రమేయం లేకుండానే గ్రామాల్లో పనులు చేస్తున్నారు. అందుకు మండల స్థాయి అధికారులు కూడా సై అంటున్నారు. ఎన్నికల ముందు సర్పంచ్‌లకు విస్తృత అధికారాలు ఇస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హమీ తుంగలో తొక్కారు. గ్రామాల్లో షాడోల పెత్తనం చలాయిస్తున్నారు.
–యల్లంరాజు వరప్రసాద్‌రాజు, సర్పంచ్,
లింగసముద్రం, సైదాపురం మండలం,
వెంకటగిరి నియోజకవర్గం
అధికారుల అత్యుత్సాహం
కూటమి ప్రభుత్వంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మా పంచాయతీలో పలు సీసీ రోడ్ల నిర్మాణం కోసం గ్రామసభ ద్వారా అవసరమున్న చోట రోడ్ల నిర్మాణానికి తీర్మాణం చేశాం. అయితే స్థానిక ఇంజినీరింగ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎలాంటి పదవులు లేని అధికార పార్టీ చోటా నేతల కనుసన్నల్లో పనులు అప్పగిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా కొత్తగా విష సంస్కృతికి బీజం వేస్తున్నారు.
–చిన్ని యాదవ్, సర్పంచ్, వెంకటపతినగర్, తిరుపతి రూరల్
హక్కులు కాలరాయడమే
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులను గ్రామాలలో చేపట్టాలంటే పంచాయతీ తీర్మానం, సర్పంచ్ అనుమతి తప్పనిసరిగా ఉండేది. అయితే ప్రభుత్వం సర్పంచుల హక్కులను కాలరాస్తోంది. వారి పార్టీ నాయకులకు ఉపాధి పనులను కట్టబెట్టేందుకు సర్పంచ్‌ల వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణం.
–వెంపళ్ల సురేంద్ర యాదవ్, సర్పంచ్, రెడ్డిపల్లె, శ్రీకాళహస్తి మండలం
– 8లో
Comments
Please login to add a commentAdd a comment