బకాయిలు విడుదలకు డిమాండ్
తిరుపతి ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిరినా ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడం దారుణమని, వెంటనే పెండింగ్ నగదు చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి డిమాండ్ చేశారు. ఆదివారం కరకంబాడి జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. పీఎఫ్, ఏ పీజీఎల్‌ఐ, సరెండర్ సెలవు, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి, కారుణ్య నియామకాలను చేపట్టాలని, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలుచేయాలని స్పష్టం చేశారు. తమ డిమాండ్‌లను నెరవేర్చకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అదనపు కార్యదర్శి జి.చెంగల్రాయ మందడి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.రమేష్, ఎస్.సురేష్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఎం.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment