అధికార నందికి విశేష పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో అధికార నందికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. కుంభాభిషేకంలో భాగంగా కలశ పూజ, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అధికార నందికి విశిష్ట అభిషేకం జరిపించి ప్ర త్యేకంగా అలంకరించారు. పెద్దసంఖ్యలో భక్తు లు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు . కార్యక్రమంలో ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా వేమన జయంతి
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా యోగి వేమన జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన చిత్రపటానికి కలెక్టర్ వెంకటేశ్వర్, డీఆర్‌ఓ నరసింహులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేమన పద్యాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సరళమైన భాషలో ఆయన రచించిన వేమన శతకం చరిత్రకెక్కిందని తెలిపారు. సమాజంలోని భిన్న కోణాలను ఆయన తన పద్యశతకంలో ఆవిష్కరించారని వెల్లడించారు. అందుకే ప్రభుత్వం ఏటా జనవరి 19వ తేదీన రాష్ట్ర పండుగగా వేమన జయంతిని నిర్వహిస్తున్నట్లు వివరించారు.
నేటి నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం
తిరుపతి సిటీ: సంక్రాంతి సెలవులు ముగిశాయి. సుమారు పది రోజుల పాటు ప్రభుత్వ, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సెలవులు పూర్తయిన నేపథ్యంలో సోమవారం నుంచి యథావిధిగా విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment