జిల్లాలో నియోజకవర్గాల వారీగా కేటాయించిన పనులు, నిధుల వి
వరదయ్యపాళెం: జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కూటమి నేతలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పల్లె పండుగ కింద గుర్తించిన పనులను తమ నేతలకు అప్పగించేలా పన్నాగాలు అమలు చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న సర్పంచ్‌ల అధికారాలను తొలగించేసింది. పంచాయతీల్లో కార్యదర్శుల ద్వారా తీర్మానాలు చేయించి, కూటమి నేతలకు రూ.కోట్ల పనులను కట్టబెట్టింది. ఎన్నికల సమయంలో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేశారు. సర్పంచ్‌లను పక్కపెట్టారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే సర్పంచ్‌లకు రెట్టింపు అధికారాలు ఇస్తామని పగల్బాలు పలికారు. ఒక్కో పంచాయతీకి రూ.కోటి పైగా నిధులు కేటాయిస్తామని ఊకదంపుడు మాటలు వల్లించారు. తీరా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహజ వైఖరిలోనే వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలవడమే ఇందుకు కారణమని, అందుకే కూటమి ప్రభుత్వం ఇంతటి దారుణంగా నిర్ణయాలు తీసుకుంటోందని గ్రామీణులు విమర్శిస్తున్నారు.
జేబులు నింపుకునేందుకే..
పల్లె పండుగ పనులు కూటమి నేతల జేబులు నింపుకునేందుకు అనుకూలంగా మారాయి. జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 811 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీలకు సంబంధించి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు, ఇతర పనుల నిర్మాణం కోసం రూ. 130.88 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.ఈ పనులు చేపట్టేందుకు గత ఏడాది ఆగస్టు 23న పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహంచారు. ఈ సమయంలోనే సందట్లో సడేమియ అన్నట్లు ఖాళీ పేపర్లలో తీర్మాన పత్రాలపై కూటమి నేతలు ఆయా పంచాయతీల సభ్యులతో సంతకాలు చేయించేసుకున్నారు. తమ పార్టీ నేతల జేబులు నింపుకునేందుకు సంబంధిత పనులు అప్పగించేశారు.
నియోజకవర్గం పంచాయతీలు పల్లె మంజూరైన
పండుగ నిధులు
పనులు (రూకోట్లలో)
గూడూరు 122 273 17.45
వెంకటగిరి 143 167 8.05
శ్రీకాళహస్తి 141 179 8.42
సత్యవేడు 169 309 19.68
చంద్రగిరి 108 464 51.20
సూళ్లూరుపేట 128 203 20.50
చట్ట విరుద్ధంగా పనుల కేటాయింపు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే స్థానిక సర్పంచ్, పాలకవర్గం తీర్మాన పత్రం తప్పనిసరి. మంజూరైన పనులను ఎవరు చేసినా బిల్లులకు సంబంధించి నిధులు మాత్రం సర్పంచ్, కార్యదర్శి ఉమ్మడి ఖాతాలో జమ అవుతాయి. అయితే చట్ట విరుద్ధంగా కూటమి సర్కారు అక్రమ జీఓలను ప్రవేశపెట్టింది. గ్రామ సభలకు సర్పంచులు హాజరుకాకపోయినా వారి స్థానంలో సీనియర్ సిటిజన్స్, ఉప సర్పంచుల ద్వారా తీర్మాన పత్రాలను సిద్ధం చేయవచ్చని పేర్కొంది. ఇదే అదునుగా స్థానిక ఎమ్మెల్యే రంగంలోకి దిగి తీర్మానాలు చేయించి, పనుల పందేరం పూర్తి చేసేశారు.
వరదయ్యపాళెం మండలంలో
టీడీపీ నేత
నిర్మించిన రోడ్డును పరిశీలిస్తున్న
అధికారులు
సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో నిర్మించిన సీసీ రోడ్డు వద్ద టీడీపీ నేతలు
ఉత్సవ విగ్రహాలుగా సర్పంచ్‌లు
పల్లె పండుగ పేరుతో దోపిడీకి టీడీపీ నేతల కుట్రలు
ఎమ్మెల్యేలు చెప్పిన వారికే పనులు
కార్యదర్శులు ద్వారా ఏకపక్ష తీర్మానాలు
సర్పంచ్‌లను అణగదొక్కి అధికారాలకు కోత
కూటమి నేతల కబంధహస్తాల్లో గ్రామ స్వరాజ్యం
Comments
Please login to add a commentAdd a comment