గని కార్మికులు.. పండుగ పూటా పస్తులే
సైదాపురం: మండలంలోని గని కార్మికులకు ఈ ఏడాది సంక్రాంతి పండుగ కూడా జరుపుకునే పరిస్థితులు లేవని, ఆ రోజూ పస్తులుండాల్సిన స్థితి నెలకొందని రాష్ట్ర సంగీత, నృత్య అకాడమి మాజీ చైర్మన్ పొట్టేళ్ల శిరీష పేర్కొన్నారు. మండల కేంద్రమైన సైదాపురంలో గురువారం ఆమె విలేకరులతో మట్లాడుతూ సైదాపురం మండలంలో ఏడు నెలలుగా స్వార్థపరుల కోసమే మైకా గనులన్నీ మూసివేశారన్నారు. అప్పటి నుంచి గని కార్మికులకు పనులు, వ్యాపారాలు లేక ఈ ఏడాది సంక్రాంతి పండుగ కూడా జరుపుకునే పరిస్థితులు కనిపించడంలేదని ఆరోపించారు. మండలంలో మొత్తం 60 మైకా గనులుండగా 24 మైకా గనులు మాత్రమే నిర్వహణ కొనసాగుతున్నట్లు తెలిపారు. దీంతో కార్మికుల కుటుంబాల పోషణ, ఫైనాన్స్‌లో తెచ్చుకున్న వాహనాలకు నెలనెలా ఈఎంఐ చెల్లించలేక చాలామంది వాహన యజమానులు అవస్థలు పడుతున్నట్లు ఆరోపించారు. నెల్లూరు నుంచి కొందరు వచ్చి సైదాపురం మండలంలో బెదిరింపులకు దిగితే చూస్తు ఊరుకోరన్నారు. ఎన్నో ఏళ్లగా లీగల్‌గా వ్యాపారం చేస్తున్న వెంకటగిరి రాజాల మైనింగ్ కళ్యాణ్‌రామ్ మైకా మైన్స్, జింపెక్స్ మైన్లను మాత్రం ఓపెన్ చేయడంలేదని ఆరోపించారు. ఆ మైన్‌లు ఎందుకు ఓపెన్‌కు చేయకూడదోనని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నా వారి వద్ద నుంచి సరైన సమాధానం రావడంలేదన్నారు.
ప్రాణదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
తిరుమల: వేంకటేశ్వరస్వామి భక్తుడు కుప్పలు గిరిధర్‌కుమార్ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.పది లక్షల విరాళం అందజేశారు. బుధవారం ఈ డీడీని తిరుమల క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment