అక్షరాలకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు
రామచంద్రాపురం: మార్కెట్‌లో ప్రముఖ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలకు సినీనటులు, క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తే.. అక్షరాలతో విద్యార్థుల భవితకు బాటలు వేసే హెచ్‌ఎంలు, టీచర్లే అసలు సిసలైన బ్రాండ్ అంబాసిడర్లు అని ఏఎంఓ శివశంకర్ అన్నారు. రామచంద్రాపురం మండలం, వెరిటాస్ సైనిక్ స్కూల్‌లో తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల హెచ్‌ఎంలకు ఆరు రోజులుగా నిర్వహిస్తున్న 6వ విడత లీడర్‌షిప్ శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. శిక్షణ పొందిన హెచ్‌ఎంలకు సర్టిఫికెట్లను అందజేశారు. పాటలు, గేయాలతో అలరించిన వివిధ జిల్లాల హెడ్మాస్టర్లను సన్మానించా రు. అనంతరం ఏఎంఓ మాట్లాడు తూ ఇక్కడ శిక్షణ, వసతులపరంగా అన్నీ అత్యుత్తమంగా ఉన్నాయని కితాబిచ్చారన్నారు. కో–ఆర్డినేటర్ సారథి, ఎంఈఓ భాస్కర్, వెరిటాస్ డైరెక్టర్ సందీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment