జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి అర్బన్: జాబ్‌మేళా పోస్టర్‌ను కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నెల 3వ తేదీ శుక్రవారం నారావారిపల్లిలోని టీటీడీ కల్యాణ మండపంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీటెక్, ఐటీఐ, పీజీ చదువుకున్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతీయువకులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథంతోపాటు మురళీకృష్ణ, గణేష్, శ్రావణి, సురేష్ హాజరయ్యారు. అదనపు సమాచారం కోసం 9030527160, 9160912690, 9177508279 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment