జిల్లాలో రహదారులు చూడతరయా!
● ఇబ్బడిముబ్బడిగా ప్యాచ్ వర్క్‌లు ● నాసిరకం పనులతో జేబులు నింపుకుంటున్న కూమిట నేతలు ● వేసిన వారం రోజులకే మళ్లీ గుంతలు ● ముక్కున వేలేసుకుంటున్న జనాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేది ఇంకొకటి అన్నట్టుగా మారింది. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలు గుప్పించేశారు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టేశారు. రోడ్లు అద్దాల్లా మెరిసిపోయేలా తీర్చిదిద్దుతామంటూ నమ్మబలికారు. ఆపై అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయ్యాక ఇప్పుడు తీరిగ్గా మేల్కొన్నారు. సంక్రాంతి పండక్కొచ్చే బంధువులు రోడ్లు చూసి అసహించుకుంటారని వెంటనే ప్యాచ్ వర్క్‌లు వేయాలని తమ అనుయాయులకు ఆదేశాలు జారీ చేశారు. వారు చెప్పిందే తడువుగా కూటమి నేతలు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తేశారు. నాసిరకంగా గుంతలు పూడ్చి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అవి వారం రోజులకే మళ్లీ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు విస్తుపోతున్నారు.
రోడ్లు ఛిద్రం..బతుకు భద్రం
తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇటీవల మూడు పర్యాయాలు కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది రహదారుల మరమ్మతు పనులు ఒకటి. త్వరలో సంక్రాంతి పండుగ వస్తుండడంతో కూటమి ప్రభుత్వం హడావుడిగా రోడ్ల మరమ్మతు పనులకు నిధులు విడుదల చేసింది. వివిధ ప్రాంతాల నుంచి పండగకు సొంత గ్రామాలకు వస్తారని, వారు వచ్చేలోపు మరమ్మతు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఇదే అదునుగా కూటమి నేతలు కాంట్రాక్టర్ల అవతారమెత్తి గుంతలకు ప్యాచ్ వర్క్‌లు వేస్తున్నారు. ఇలా వేసిన ప్యాచ్ వర్క్‌లు వారం రోజులకే మళ్లీ పాడైపోతున్నాయి. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఏమయ్యాయని కూటమి ప్రభుత్వ పెద్దలను వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
రోడ్ల మరమ్మతులకు నిధులు
నియోజకవర్గం పనుల మంజూరైన
సంఖ్య మొత్తం
రూ.కోట్లలో
తిరుపతి డివిజన్ 79 6.75
వెంకటగిరి 10 2.7
గూడూరు 3 1.2
సూళ్లూరుపేట 20 4
Comments
Please login to add a commentAdd a comment