యూకేను తాకిన పెట్లూరు నిమ్మ
సైదాపురం: దక్షిణ భారతదేశంలో నిమ్మ, చినీ పంటల తయారీలో ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న వెంకటగిరి సమీపంలోని పెట్లూరు నిమ్మ, చినీ పరిశోధన కేంద్రానికి అరుదైన ఘనత దక్కింది. యూకే నుంచి భారత పర్యటనకు వచ్చిన పారిశ్రామికవేత్త హూగోబొవిల్ శుక్రవారం ప్రత్యేకంగా పరిశీలించారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఆయన డివిజన్ కేంద్రం గూడూరులోని సిఫల్ హెర్బల్ సంస్థ ఎండీ ఎలవర్తి విద్యాసాగర్, ఇండో వరల్డ్ ట్రైడింగ్ కార్పొరేషన్ (న్యూఢిల్లీ) ఉపాధ్యక్షుడు అనిల్ కాత్యాల్‌తో కలసి వెంకటగిరి రూరల్ మండలంలోని పెట్లూరు గ్రామ సమీపం వద్ద ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉధ్యాన విశ్వవిద్యాలయం, పెట్లూరు నిమ్మ, చినీ పరిశోధన స్థానాన్ని సందర్శించారు. నిమ్మ, చినీ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పీ.శ్యామ్‌సుంధర్ రెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్ ఖాందార్ నాయక్‌లతో నిమ్మ పంట విఽధివిధినాలు, సుగంధ ద్రవ్యాల్లో నిమ్మ ప్రాముఖ్యతపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment