పర్యాటక కేంద్రంగా అరణియార్
నాగలాపురం: పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టును మంచి టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దుతామని జేసీ శుభం బన్సల్ తెలిపారు. ఈ మేరకు అరణియార్ పర్యాటక అభివృద్ధి పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న టూరిజం డెవలప్‌మెంట్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా పిచ్చాటూరు జూనియర్ కళాశాలకు సంబంధించిన ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు, బాలికల వసతి గృహం, రోడ్డు నిర్మాణ పనులకు నిధులు కేటాయించనున్నట్టు వెల్లడించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. అరణియార్ ఆయకట్టు సంఘ అధ్యక్షులు రవిరెడ్డి, తహసీల్దార్ రమేష్‌బాబు, ఆర్‌ఐ సుధాకర్, ఇరిగేషన్ ఏఈ లోకేశ్వర్‌రెడ్డి, వీఆర్వోలు కృష్ణ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఇంకా అందని వేతనాలు
తిరుపతి సిటీ: ఎస్వీయూలో ఈ నెల ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా వేతనాల ఊసేలేకపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిలో రెండు నెలల పాటు నరకం అనుభవించిన వేతన జీవులు ఈ నెల 4వ తేదీ వస్తున్నా వేతనాలు అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. గత ఆరు నెలలుగా వర్సిటీలో సమయానికి జీతాలు అందక ఈఎమ్‌ఐలు కట్టుకోలేక, కుటుంబ ఖర్చుల కోసం ఇబ్బందులకు గురవుతున్నారు. నూతన ఏడాది నుంచి ఒకటో తారీఖున జీతాల జమచేస్తారని ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో 06 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 62,085 మంది స్వామివారిని దర్శించుకోగా 15,680 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ముక్కంటి సేవలో
విదేశీ భక్తులు
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని శుక్రవారం 70మంది అమెరికా భక్తులు దర్శించుకున్నారు. పెంచలకోన కరుణామయి ఆశ్రమ వ్యవస్థాపకురాలు భగవతి విజశ్వరదేవితో కలిసి వచ్చారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment