గొబ్బిదేవతకు పుర ఉత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గొబ్బిదేవతకు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ లయ అలంకార మండపంలో గొబ్బిదేవత ఉ త్సవమూర్తికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి పురవీధు ల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనా లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 56,550 మంది స్వామివారిని దర్శించుకోగా 28,853 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.34 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
మధ్యవర్తిత్వంపై అవగాహన
తిరుపతి లీగల్: రాయలసీమ జిల్లాలకు చెందిన 25 మంది న్యాయమూర్తులకు ఈనెల ఆరో తేదీ నుంచి మధ్యవర్తిత్వం అనే అంశంపై అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి గురునాథ్ తెలిపారు. రాష్ట్ర న్యాయసేవ సంస్థ, ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ, తిరుపతి మండల న్యాయ సేవ అధికార సంస్థ సంయుక్తంగా రాయలసీమ జిల్లాలకు చెందిన 25 మంది న్యాయమూర్తులకు తిరుపతి శ్వేత భవనంలో ఈనెల ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment