భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యం
తిరుమలకు వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఆహారం అందించాలని టీటీడీ అదనపు ఈఓ ఓటళ్ల యజమానులను ఆదేశించారు.
ఆందోళన వద్దు
హెచ్‌ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనదేశంలో దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ వైరస్ పట్ల ఎలాంటి సంకేతాలు లేవు. ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు, జ్వరం, దగ్గుతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
– డాక్టర్ బాలకృష్ణనాయక్, జిల్లా
వైద్య ఆరోగ్యశాఖ అధికారు. తిరుపతి జిల్లా
అంత ప్రభావం ఉండకపోవచ్చు
కోవిడ్ 19 తరహాలో హెచ్‌ఎంసీవీ వైరస్ ప్రభావం ఉండకపోవచ్చు. అలా అని నిర్లక్ష్యం వహించొద్దు. కోవి డ్ తరహాలో తీసుకున్న జా గ్రత్తలను తీసుకోవాలి చై నా పరిస్థితులను పరిశీలిస్తే మూడు శాతం మందికి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తమా, షుగర్ ఉన్న వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. – డాక్టర్ రవిప్రభు,
సూపరింటెండెంటు, రుయా, తిరుపతి
జాగ్రత్తగా ఉండాలి
అందరూ ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించా లి. చేతులు తరచూ సబ్బు తో శుభ్రం చేసుకోవాలి. హెచ్‌ఎంపీవీ వైరస్ చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. వైరస్ సోకిన తర్వాత వారం రోజుల పా టు లక్షణాలు ఉండొచ్చు. వ్యాధికారక ఉనికిని ఆర్టీపీసీఆర్ ద్వారా నిర్ధారించొచ్చు. ఆస్తమా నుంచి న్యుమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వరకు క్లినికల్ వ్యక్తీకరణలు ఉంటాయి.
– లోకేష్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్,
అమర ఆస్పత్రి, రేణిగుంట
అప్రమత్తంగా ఉండాలి
హెచ్‌ఎంటీవీ వైరస్ వైరస్ పిల్లలకు సోకే అవకాశం ఉందని తెలుస్తోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసు కోవాలి. జ్వరం, జలుబు, దగ్గు పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. రోగ నిరోధక శక్తి పెంచే అన్ని ఆహారాలను పిల్లలకు అందించాలి. పాఠశాలలకు పిల్లల్ని పంపించేటప్పుడు మాస్కులు తప్పనిసరి
– డాక్టర్ వెంకటశ్వరరెడ్డి, చిన్నపిల్లల
వైద్య నిపుణులు, సురక్ష కిడ్జ్ ఆస్పత్రి, తిరుపతి
– 8లో
Comments
Please login to add a commentAdd a comment