పీఆర్ ఏఈ అలసత్వంపై ఆగ్రహం
రేణిగుంట(ఏర్పేడు): ‘ఏర్పేడు మండలంలో రూ.1.70 కోట్లతో 35 సీసీ రోడ్డు పనులు మూడు నెలలకు ముందు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు రూ.41 లక్షల విలువ గల 11 పనులు మాత్రమే చేశారు. ఇంకా 24 రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టకపోవడం ఏంటి?..’అంటూ మండల ఇంజినీరింగ్ అధికారి(పీఆర్ ఏఈ) రవితేజపై జిల్లా డ్వామా పీడీ సీవీ శ్రీనివాసప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పేడు మండలం, అంజిమేడులో జరుగుతున్న మినీ గోకులం పనులను ఆయన సోమవారం పరిశీలించారు. రెండు రోజుల్లో పెండింగ్ గోకులాలను పూర్తి చేయాలన్నారు. పంచాయతీలో జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిమెంట్ రోడ్డు నిర్మించిన వారం రోజుల్లో మెటీరియల్ బిల్లులు పడిపోతున్నాయని, వెంటనే సిమెంట్ రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. పీఆర్ ఏఈ నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. ఏపీఓలు చంద్రశేఖర్ రాజు, అవిలాల దేవరి, మండల ఇంజినీర్ బీ.రవితేజ, టెక్నికల్ అసిస్టెంట్ శాలిమనోహర్, జూనియర్ ఇంజినీర్ పంజాడ బాలాజీరావ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment