సమస్యకు పరిష్కారం చూపండి
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 214 అర్జీలు వచ్చాయి. అందులో 148 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. కలెక్టర్ మాట్లాడుతూ సమస్య పరిష్కారం కాకుంటే.. అర్జీదారులకు ఎందుకు సమస్య పరిష్కారం కావడం లేదు... అందుకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటీ అనే వివరాలను రెవెన్యూ సమస్యలపై తెలియజేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌తోపాటు డీఆర్వో నరసింహులు, పలువురు జిల్లా అధికారులు ఇదే అంశాన్ని అర్జీదారులకు వివరించే ప్రయత్నం చేశారు.
నాకు న్యాయం చేయండి సార్
‘నేను ఇప్పటి వరకు గడిచిన మూడు నెలల్లో ఆరు సార్లు కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చాను. నాకు న్యాయం చేయండి..’ అంటూ తిరుపతిలోని వేదాంతపురానికి చెందిన డీ.చంద్రశేఖర్ మొరపెట్టుకున్నారు. ఏర్పేడు మండలంలోని వికృతమాల ప్రాజెక్టులో ఇంటి కోసం రూ.80వేలు చెల్లించామని, అయితే గృహనిర్మాణశాఖ అధికారులు తమకు వికృతిమాల అపార్ట్‌మెంట్‌లో ఇంటిని కేటాయించినట్లు చెబుతున్నారని చెప్పారు. కానీ ఇంటిని మాత్రం చూపించలేదని ఆవేదన చెందారు.
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 214 అర్జీలు
డీ.చంద్రశేఖర్
మా ఊరికి దారి లేదు
మా ఊరికి దారి చూపండి కలెక్టర్ గారు.. అంటూ పాకాల మండలంలోని మొగరాల రెవెన్యూ పరిధి, గెరికినెట్టు గ్రామానికి చెందిన వారు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. గానుగపెంట–మొగురాళ్ల రోడ్డును ఇటీవల మూత వేయడంతో ఆ మార్గంలోని గెరికిమెట్టు గ్రామానికి వెళ్లలేక తిప్పులు పడుతున్నట్టు వాపోయారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment