కరోనా వైరస్ ముందు ప్రపంచమే తలవంచ్చింది. వైరస్ వచ్చిన
తిరుపతి తుడా: హ్యూమన్ మెటాఫ్ న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) వైరస్ ప్రపంచాన్ని వణికించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం చైనాను అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్ ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. మొదటి కేసు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నమోదవడం కలకలం రేపుతోంది. తిరుపతి, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు అత్యంత సమీపాన బెంగళూరు నగరం ఉండడంతో పాటు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. హెచ్‌ఎంపీవీ కేసు నిర్ధారణ అయినట్లు ఐసీఎంఆర్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
స్థానికంగా విస్తరిస్తోందా..?
బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు చైనా వైరస్ సోకిందని ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్లో వారిద్దరిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్స్‌ను గుర్తించామంది. ఆ ఇద్దరు బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన చరిత్ర లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం. స్థానికంగానూ ఈ వైరస్ విస్తరించిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాప్తి ఇలా...
కరోనా మహమ్మారి మాదిరిగానే హెచ్‌ఎంటీవీ ఇన్ఫెక్షన్ లక్షణాలు వ్యాప్తి చెందుతున్నాయి. తుమ్ములు, దగ్గు వల్ల వెలువడే తుంపర్ల నుంచి వైరస్ ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతుంది. వైరస్ ఉన్న వారితో సన్నిహితంగా మెలగడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ ధరించకపోవడం, తరచూ చేతులను శుభ్రంగా కడగక పోవడం వంటి కారణాల చేత ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
హెచ్‌ఎంపీవీ వైరస్ కలకలం
బెంగళూరులో ప్రత్యక్షం
కొందరికి నిర్ధారణ అయినట్లు
ప్రకటించిన ఐసీఎంఆర్
ఈ వైరస్ కూడా కోవిడ్ తరహా లక్షణాలే
అప్రమత్తత అవసరమంటున్న వైద్య నిపుణులు
భయాందోళనకు గురవుతున్న జిల్లా ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment