విద్యార్థులకు పౌష్టికాహారం ముఖ్యం
వెంకటగిరి రూరల్: విద్యార్థులకు ముఖ్యంగా పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలసి మధ్యాహ్నభోజనం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా పరిధిలోని 21 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కళాశాల వయసులోనే విద్యార్థులు పౌష్టికంగా ఉండాలని సూచించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, బాల్య వివాహలను నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. తర్వాత వారితో కలసి సహఫంక్తి భోజనం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా భానుప్రియ, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి విశ్వనాథ్‌నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి సురేష్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment