శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారు. అక్రమార్కుల నుంచి మామూళ్లు తీసుకుని మిన్నకుండి పోతున్నారు. ముఖ్యంగా పెళ్లకూరు మండల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు ఇసుక లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్లను స్థానిక రైతులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించినా స్పందించే నాథుడే కరువయ్యాడు. అక్రమార్కులు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పోలీసులకు నెలవారీ మామూళ్లు ముట్టజెపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, కలవకూరు, పెన్నేపల్లె, దిగువచావలి గ్రామాలను కేంద్రంగా చేసుకుని కొందరు ట్రాక్టర్ యజమానులు, ఇసుక వ్యాపారులు కలిసి స్వర్ణముఖినదిని యథేచ్ఛగా దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరికి కూటమి నేతలు అండగా నిలుస్తూ, వాటాలు వసూలు చేసుకుంటున్నట్టు ఆయా గ్రామాల ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. అక్రమార్కుల కారణంగా నదీ తీరంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో అక్రమ తవ్వకాలు కొనసాగితే చుట్టుపక్కల గ్రామాలకు నీటి ఎద్దడి తప్పదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకం, రవాణాకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment