నేలవాలిన వరి
● అకాల వర్షంతో పంట నష్టం ● ఆందోళనలో రైతాంగం
ఆరుగాలం కష్టించి పండించి పంట ఎప్పుడు
ఇంటికి చేరుతుందా.. శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అన్నదాతలను అకాల వర్షం నిలువునా ముంచేసింది. ప్రభుత్వం సాయం చేయకపోయినా.. అప్పో సప్పో చేసి సాగు చేపడితే నష్టాల ఊబిలోకి
నెట్టేస్తోంది. బ్యాంకు రుణాలు, ఎరువుల దుకాణాల వారికి కట్టాల్సిన నగదు ఎలా చెల్లించాలి దేవుడా అనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు సూళ్లూరపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు 2,500 ఎకరాలకు పైగా వరి పంట నేలవాలింది.చేతి కందే దశలో పైరు దెబ్బతినడంతో రైతాంగం తీవ్రంగా ఆందోళన
చెందుతోంది. – సూళ్లూరుపేట
సూళ్లూరుపేట మండలం మంగళంపాడు వద్ద నేలకొరిగిన వరిపైరు
Comments
Please login to add a commentAdd a comment