తిరుపతి తుడా: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కార్పొరేషన్‌లో కనీస బలం లేని చోట గెలవాలని చూడడం అప్రజాస్వామికమన్నారు. డెప్యూటీ మేయర్ పోటీదారుడ్ని భయభ్రాంతులకు గురిచేసి, ఆయన ఆస్తులను ధ్వంసం చేసి లొంగదీసుకునే ప్రయత్నం సిగ్గుచేటన్నారు. అలానే వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు దిగడం దుర్మార్గమన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా, చట్టాలను అతిక్రమించి భవనాలను కూల్చడం అన్యాయమన్నారు. భవన నిర్మాణానికి అనుమతులు లేకుంటే నోటీసులు ఇచ్చి పనులను ఆపాలే తప్ప కూల్చే అధికారం ఎవరికీ ఉండదన్నారు. తమకు పూర్తి మెజారిటీ ఉన్న స్థానంలో పోటీ చేస్తున్నమే తప్ప పిరాయింపులను ప్రోత్సహించడం లేదని ఆయన చెప్పారు. ఈ క్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆయన వాగ్వాదానికి దిగారు. నోటీసులు ఇవ్వకుండా భవనంపైకి ఏ అధికారంతో వచ్చారని నిలదీశారు.
48 మంది అరెస్ట్
అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు వెళ్లిన నగర మేయర్ డాక్టర్ ఆర్.శిరీష, వైఎస్‌ఆర్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డితోపాటు పార్టీ ముఖ్య నేతలు, ఇతర నాయకులు 48 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌లో 25 మంది, వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో 23 మందిని అరెస్టు చేసి ఆపై విడుదల చేశారు.
అరెస్టు చేశాక పోలీసు ప్రొటెక్షన్ కోరిన
టౌన్ ప్లానింగ్
టౌన్ ప్లానింగ్ అధికారులు అడుగడుగున తప్పటడుగులు వేశారు. ఉదయం నిరసన కార్యక్రమం అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించాక టౌన్ ప్లానింగ్ అధికారులు అప్పటికప్పుడు పోలీసు ప్రొటెక్షన్ కోరుతూ కాపీలను సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment