● అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న వైనం ● ఆర్సీ పురం
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్
రోజూ 50 టిప్పర్లు.. 500 ట్రిప్పులు
కొండలు, గుట్టలు అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల్లో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంతగా మట్టి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. రాత్రి పూట అక్రమంగా మట్టి తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. రామచంద్రాపురం మండలంలోని నెన్నూ రు, రామాపురం, రాయలచెరువు, పీవీపురం, నెత్తకుప్పం, అనుపల్లి, బొప్పరాజుపల్లి ప్రాంతాల్లో నిత్యం మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రోజుకు 50 టిప్పర్ల చొప్పున.. అందులో ఒక్కొక్క టిప్పర్ పది ట్రిప్పుల వంతున మట్టి తరలిస్తున్నాయి. ఆ లెక్కన 500 ట్రిప్పుల మట్టి బయటకు తరలుతోంది. ఈ మొత్తం మట్టి మాఫియాకు నియోజకవర్గ ముఖ్యనేత అండ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకు రోజుకు 50 టిప్పర్ల నుంచి రూ.7.5 లక్షల వరకు అవినీతి ఖాతాలోకి జమచేస్తున్నట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పచ్చదనాన్ని హరించి వేస్తూ కొండలు, గుట్టలను కొల్లగొడుతున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. రామచంద్రాపురాన్ని అడ్డాగా చేసుకుని మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో సాగుతున్న ఈ దందాపై ఏ అధికారీ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment