తిరుమల నంబి సన్నిధిలో మలయప్ప స్వామి
తిరుమల: తిరుమలలో 25 రోజుల పాటు అధ్యయనోత్సవాలు పూర్తయిన సందర్భంగా మరుసటి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు శుక్రవారం సాయంత్రం దక్షిణ మాడ వీధిలో తిరుమల నంబి సన్నిధిని దర్శించుకున్నారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం సన్నిధిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఒంటరి ఏనుగును
మళ్లించిన అధికారులు
పాకాల: మండలంలోని పదిపుట్లబైలు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగును శుక్రవారం అటవీశాఖ అధికారులు తిరుపతి జిల్లా అటవీ పరిధిని దాటించారు. 4,5 రోజులుగా మండలంలోని పదిపుట్లబైలు పంచాయతీ, కొమ్మిరెడ్డిగారిపల్లె రోడ్డు మార్గంలోని చింతలవంక డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఏనుగు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దీనికి కోసం గస్తీ నిర్వహించారు. ప్రజలు, రైతులు సమీప ప్రాంతాల్లోకి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. సుమారు 30 మంది అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్స్‌తో గాలించారు. రాత్రి 7.30 ప్రాంతంలో ఏనుగును గుర్తించిన అధికారులు సిబ్బంది మండల సరిహద్దుల నుంచి తరలించారు. దీంతో అది చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. దీంతో స్థానిక రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment