‘అంతిమ’ కష్టాలు!
ఉచ్ఛ్వాస, నిశ్వాసల మధ్యన ఊగిసలాగే బతుకు పోరు ముగిశాక ప్రశాంతంగా జరగాల్సిన చివరి మజిలీకి శ్మశాన కష్టలూ తప్పడం లేదు. ఏర్పేడు మండలం, ఎండీ పుత్తూరు గ్రామంలో గురువారం చింత పుట్టాలమ్మ(98) మృతి చెందారు. శుక్రవారం అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడంతో స్వర్ణముఖి నది ఒడ్డునే దహన సంస్కారాలు నిర్వహించాలని భావించారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీటి ప్రవాహం పెరగింది. నది దాటే వీలులేని పరిస్థితి నెలకొంది. దీంతో పీకల్లోతు నీటిలోనే పాడె మోసుకుంటూ, ఆమె కుటుంబీకులు, బంధువులు నది అవతలకి దాటి అంత్యక్రియలు ముగించారు. గుప్పెడు మట్టి వేయాల్సిన దాయాదులలో కొందరు వయోభారంతో నదిని దాటలేక, గట్టుకు ఇటువైపే ఉండిపోయారు. – రేణిగుంట(ఏర్పేడు)
Comments
Please login to add a commentAdd a comment