మహిళా ఓటర్లే అధికం
● నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం ● జిల్లా ఓటర్లు 18.04,229 మంది
తిరుపతి అర్బన్: జిల్లాలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం ఇటీవల ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా ఓటర్లు మొత్తం 18,04,229 మంది కాగా అందులో సీ్త్రలు 9,25,735 మంది, పురుషులు 8,78,321 మంది, ఇతరులు 173 మంది ఉన్నారు. ఈ ఏడాది తుది జాబితా ప్రకారం 47,414 మంది సీ్త్రల ఓట్లు అధికంగా ఉన్నాయి.
ఓటు హక్కు వినియోగించుకోవాలి
నాకు కొత్తగా ఓటు వచ్చింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎ న్నికల్లో తొలి సారి నా ఓటు హ క్కును సద్వినియోగం చేసుకున్నా. ఓటు చాలా విలువైంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. – పద్మప్రియ, శ్రీకాళహస్తి నియోజకవర్గం
దరఖాస్తు చేసుకున్నాం
కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఓ టు వచ్చిన తర్వాత జరిగే ఏ ఎన్నికల్లోనైనా నా ఓటును స ద్వినియోగం చేసుకుంటాను. తప్పకుండా 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. – చరిత, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment