● డీడీఈ పరీక్షా కేంద్రాల కేటాయింపుపై విద్యార్థి సంఘాల ఆ
తిరుపతి సిటీ: ఎస్వీయూలో అధికారులు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదమవుతోంది. డీడీఈ పరీక్షలను వాయిదాలతో కాలక్షేపం చేసి ఎట్టకేలకు వచ్చే నెల 3 నుంచి నిర్వహించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను సైతం విడుదల చేశారు.
వర్సిటీ పరిధిలోని అన్ని స్టడీ సెంటర్లకు సమాచారం అందించారు. కానీ పరీక్షా కేంద్రాల కేటాయింపులో గందరగోళం సృష్టించారు. అవినీతికి పాల్పడి మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలలో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు రగిలిపోతున్నారు. ఇదే అదునుగా స్టడీ సెంటర్ల యాజమాన్యాలు వర్సిటీ అధికారులతో కుమ్మకై పేద విద్యార్థుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు ఏకమై పరీక్షా కేంద్రాలను ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వీసీని కలిసి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు.
తుది నిర్ణయం తీసుకోలేదు
డీడీఈ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై ఇంతవరకు తుది నిర్ణయం తీసుకోలేదు. గతంలో అఫ్లియేటెడ్ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. ఈ విషయంపై డీడీఈ అధికారులతో రివ్యూ మీటింగ్ జరిపి నిర్ణయం తీసుకుంటాం. విద్యార్థి సంఘాల నుంచి వినతి పత్రాలు వచ్చాయి. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని సమావేశంలో చర్చిస్తాం.
– ప్రొఫెసర్ సీహెచ్ అప్పారావు, వీసీ, ఎస్వీయూ
నిబంధనలు పాటించకుంటే ఉద్యమిస్తాం
డీడీఈ పరీక్షల నిర్వహణ లో అధికారులు అలస త్వం వహిస్తే సహించం. పరీక్షా కేంద్రాల కేటాయింపులో యూజీసీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నిబంధనల ప్రకారమే కేటాయించాలి. అఫ్లియేటెడ్, ప్రైవేటు విద్యాసంస్థలలో పరీక్షలు నిర్వహిస్తే పూర్తి స్థాయిలో మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఉంటుంది. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు అమర్చాలి. ప్రైవేటు సంస్థలలో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
– శివశంకర్ నాయక్, గిరిజన నవసమాజ్
వ్యవస్థాపక అధ్యక్షలు, ఎస్వీయూ
అవినీతి అంతు తేల్చాలి
ఎస్వీయూ డీడీఈ పరీ క్షా కేంద్రాల కేటాయింపులో లక్షల చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సి టీ అధికారులు, స్టడీ సెంటర్ల నిర్వాహకుల మధ్య పెద్ద ఎత్తున అవినీతి జరిందనే విష యంపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చాలి. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – వినోద్‌కుమార్,
ఎస్వీయూ ఎస్‌ఎఫ్‌ఐ, కార్యదర్శి
ప్రైవేటు పరీక్షా కేంద్రాలను రద్దు చేయాలి
ఎస్వీయూలో అధికారుల ఆగడాలకు అవదులు లేకుండా పోతున్నాయి. పేద విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నారు. డీడీఈ పరీక్షా కేంద్రాల ఏర్పాటులో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రైవేటు పరీక్షా కేంద్రాలను వెంటనే రద్దు చేయాలి.
– ప్రవీణ్, ఏఐఎస్‌ఎఫ్,
జిల్లా కార్యదర్శి
న్యాయపోరాటం చేస్తాం
డీడీఈ పరీక్షలను ప్రభుత్వ విద్యా సంస్థలలో కాకుండా ప్రైవేటు కళాశాలలో నిర్వహిస్తే న్యాపోరాటం చేస్తాం. ఉన్న త విద్యామండలి అధికారులతో పాటు గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదు చే స్తాం. దూరవిద్యా కేంద్రాల స్టడీసంటర్ యాజమాన్యాల కనుసన్నులో నడుస్తు న్న ప్రైవేటు సంస్థలలో మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో విద్యార్థుల నుంచి మామూళ్లు వసూళ్లు చేసేందుకు కొన్ని సెంటర్ల యాజమాన్యాలు ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. – పీ.సుందరరాజు,
నేషనల్ లా స్టూడెంట్స్ అసోసియేషన్, అధ్యక్షులు, ఎస్వీయూ
డీడీఈ పరీక్షలకు హాజరుకానున్న
విద్యార్థుల వివరాలు (సుమారు)
మొత్తం డీడీఈ సెంటర్లు – 86
పరీక్షలు జరిగే డీడీఈ సెంటర్లు – 45
పీజీ (అన్ని కోర్సులు) – 7,500
యూజీ (బీఏ, బీకాం, బీఎస్సీ)– 22,600
Comments
Please login to add a commentAdd a comment