ప్లాన్‌–ఏ బెడిసికొట్టింది.. ప్లాన్‌–బీ అమలుకు యత్నం | - | Sakshi
Sakshi News home page

ప్లాన్‌–ఏ బెడిసికొట్టింది.. ప్లాన్‌–బీ అమలుకు యత్నం

Published Mon, Feb 3 2025 1:28 AM | Last Updated on Mon, Feb 3 2025 1:28 AM

ప్లాన్‌–ఏ బెడిసికొట్టింది.. ప్లాన్‌–బీ అమలుకు యత్నం

ప్లాన్‌–ఏ బెడిసికొట్టింది.. ప్లాన్‌–బీ అమలుకు యత్నం

● ఉపఎన్నికకు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను అడ్డుకునే కుట్ర ● కార్పొరేటర్ల తల్లిదండ్రులు, బంధువులు, మిత్రుల ద్వారా పైరవీలు ● ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బేరం ● ఉన్నది ఒకే ఒక కార్పొరేటర్‌ ● డిప్యూటీ మేయర్‌ పదవిని దక్కించుకోవాలని ఆరాటం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కూటమి కుట్రలు తారాస్థాయికి చేరాయి. ఒకే ఒక్క కార్పొరేటర్‌ బలంతో డిప్యూటీ మేయర్‌ పదవిని కొట్టేసేందుకు తొక్కని అడ్డదారులు లేవు.. చేయని ప్రయత్నాలు లేవు. నిన్నటివరకు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారు. ‘అంతు చూస్తాం.. మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం. కేసులు పెడుతాం’ అని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. వారి బెదిరింపులకు లొంగ కపోవడంతో అధికారాన్ని ఉపయోగించి.. ఆస్తులను ధ్వంసం చేయడం ప్రారంభించారు. అలా అడ్డదారిలో వైఎస్సార్‌సీపీ డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని కూటమి వైపు లాక్కున్నారు. వైఎస్సార్‌సీపీ కూటమి బెదిరింపులకు బెదరని వ్యక్తి అయిన లడ్డూ భాస్కర్‌రెడ్డిని డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించి బరిలోకి దింపింది. తొలుత చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ప్లాన్‌ బీకి షిఫ్ట్‌ అయ్యారు. ఆ ప్లాన్‌ బీ కథా కమామిషేంటో చూద్దాం రండి. తిరుపతి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో డిప్యూటీ మేయర్‌ పదవికి రాజీనామా చేసిన విష యం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సోమవారం జరగనున్న డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక కోసం కూటమి నేతలు రకరకాల కుట్రలకు తెరలేపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు తిరుపతి కార్పొరేషన్‌ మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను లాక్కునేందుకు కుట్రలు పన్నింది. తిరుపతి కార్పొరేషన్‌లో ఒకే ఒక్క కార్పొరేటర్‌ బలం ఉన్న కూటమి నేతలు అత్యాశకు పోయి ఉన్న పరువు పోగొట్టుకుంటున్నారు. అస్సలు బలమే లేకపోయినా డిప్యూటీ మేయర్‌ పదవి కోసం కూటమి నేతలు పాకులాడటాన్ని చూసి నగర వాసులు నవ్వుకుంటున్నారు. కూటమి నేతలు చేస్తు న్న వికృత చేష్టలు చూసి ‘ఔరా’ అని ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నటి వరకు చేసిన ఆస్తుల విధ్వంస కాండ పూర్తిగా బెడిసికొట్టడంతో కూటమి నేతలు ‘ప్లాన్‌–బి’కి పదునుపెట్టారు. డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నికకు వైఎస్సార్‌సీపీ విప్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఎన్నికకు అడ్డుకునే కుయుక్తులు

ఉప ఎన్నిక సమయంలో హాజరైన కార్పొరేటర్ల సంఖ్య ఆధారంగా ఎవరికి ఎక్కువ మంది ఉంటే వారే విజయం సాధించే అవకాశం ఉంది. కూట మి నేతలతో అంటకాగుతున్న వైఎస్సార్‌సీపీ కా ర్పొరేటర్ల బలంతో డిప్యూటీ మేయర్‌ పదవిని కై వ సం చేసుకోవచ్చని పథకం వేశారు. అందు కోసం కూటమి నేతలంతా ఎవరికి వారు కార్పొరేటర్లను ఉపఎన్నికకు హాజరు కాకుండా అడ్డుకునేందుకు నానా రకాలుగా కుయుక్తులు చేస్తున్నారు.

కూటమి అభ్యర్థిగా ఆ ఒక్కడే

కార్పొరేషన్‌లో ఒకే ఒక్క కార్పొరేటర్‌తో సరిపెట్టుకున్న టీడీపీ.. డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నికలోనూ ఆ ఒక్క కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ పోటీ చేయక తప్పడం లేదు. ఇతను ఖర్చు పెట్టలేరని, కూటమితో అంటకాగుతున్న వారిలో ఎవరో ఒకరిని ఉప ఎన్నికల బరిలో నిలిపేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే కూటమికి అధికారికంగా కార్పొరేటర్‌ ఉన్నది ఒక్కరే. ఆ ఒక్కరు మినహా మిగిలి వారెవరిని బరిలో నిలిపినా.. వారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థే అంటారే తప్ప కూటమి అభ్యర్థి అనరు కదా? అన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతో కూటమి తరుఫున డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి దాదాపు ఆర్సీ మునికృష్ణే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంకెవరిని బరిలో దింపినా కూటమికి ఏ మాత్రం ప్రయోజనకరంగా ఉండదనే అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సోమవారం జరగనున్న డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు చేసినా అంతిమ విజయం మాత్రం వైఎస్సార్‌సీపీదే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాత్రంతా వేట

కార్పొరేటర్ల కోసం కూటమి నేతలు రాత్రంతా వేట సాగించారు. అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని కార్పొరేటర్ల బంధువులను బెదిరింపులకు దిగారు. బేరాలు ఆడడం, అరెస్ట్‌లు చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం తదితరా లతో కొంత గందరగోళం ఏర్పడింది. కానీ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కూటమి నేతలకు లొంగకుండా తప్పించుకుని తిరిగినట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement