ఉపఎన్నికలో పాల్గొనకుండా ఉండేందుకు కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, వారి తల్లిదండ్రులు, మిత్రులు, బంధువుల ద్వారా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మరో వైపు మరోసారి బెదిరింపులకు దిగారు. పోలీసుల ద్వారా కూడా ఫోన్లు చేయించి బెదిరించినట్లు కార్పొరేటర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చేసేది లేక కూటమి నేతలు కాళ్లవేళ్లా పడుతున్నారు. ఉపఎన్నికలో పాల్గొంటే ఎవరికో ఒకరికి చేయి ఎత్తాలి. అలా ఎత్తితే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తమ పదవులు కోల్పోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉప ఎన్నికకు పాల్గొనకుండా ఉంటే చాలని ప్రాధేయపడుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment