● మంత్రి అనగాని సమక్షంలోనే టీడీపీ, జనసేన వాగ్వాదం
శ్రీకాళహస్తి: పట్టణంలోని కూటమి పార్టీల మధ్య అసమ్మతి కుంపటి రగులుతోంది. తమకు కనీస గౌరవం ఇవ్వడంలేదంటూ జనసేన నేతలు బాహాటంగా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా శనివారం శ్రీకాళహస్తి పురపాలకసంఘ కార్యాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించేందుకు విచ్చేసిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ వద్ద కొందరు జనసేన నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఇన్‌చార్జ్ వినుతకు కనీస గౌరవం ఇవ్వడం లేదని సమావేశానికి సైతం సమాచారం ఇవ్వలేదని వాపోయారు. ముక్కంటి ఆలయంలో కారు పార్కింగ్ టెండర్‌ను నిబంధనల ప్రకారం జనసేన కార్యకర్తలు దక్కించుకున్నప్పటికీ కొందరు టీడీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా టెండర్లు అప్పగించకుండా అడ్డుకుంటున్నారని, జనసేన ఫ్లెక్సీలను చింపేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కలుగజేసుకుని జనసేనలో వర్గ పోరు, నాలుగు గ్రూపుల మధ్య అంతర్గతంగా విభేదాలున్నాయని, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వా గ్వాదం చోటు చేసుకుంది. జనసేనలో ఓ వ్యక్తిని మా త్రమే టీడీపీ దగ్గరికి తీసి, మిగిలినవారిని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని జనసేన కార్యకర్తలు వాపో యారు. రెండు నెలల క్రితం తిరుపతిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ శ్రీకాళహస్తి నియోజకవర్గంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో కూడా జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినుత వర్గీయులు టీడీపీ పొత్తు ధర్మం పాటించడంలేదని తమను మనస్తాపానికి గురి చేస్తున్నారని అందరి సమక్షంలో మంత్రి ఎదుట బహిర్గతం చేశారు. అప్పట్లో మంత్రి చర్చలు జరిపి పరిస్థితిని పరిష్కరిస్తానని భ రోసా ఇచ్చారు. అయితే ఎలాంటి మార్పు రాకపోవడంతో తాజాగా పురపాలక సంఘ కార్యాలయంలో మంత్రి ఎదుట జనసేన కార్యకర్తలు వాగ్వాదం చే యాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా శ్రీకాళహస్తి కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన మధ్య అసమ్మతి సెగ రగులుతున్న అంశం పురపాలకసంఘం కార్యాలయంలో జరిగిన సమావేశం వీడియోతో రెండు రో జుల నుంచి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున్న వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment