డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
● జేసీ, ఎన్నికల అధికారి శుభం బన్సల్
తిరుపతి సిటీ: ఖాళీగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికల ప్రక్రియ కు సంబంధించి ప్రత్యేక సమావేశ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేసీ, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్‌లో జరగనున్న ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్ల ను ఆయన పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెనేట్ హాల్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నిక సోమవారం 11 గంటలకు జరగనున్న నేపథ్యంలో సంబంధిత కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సమయానికంటే ముందుగా ఎస్వీ యూ సెనేట్ హాల్‌లో హాజరుకావాలని సూచించారు. సెల్‌ఫోన్లకు అనుమతి లేదని, ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకుని రావాల్సి ఉంటుంద న్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్‌తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఎస్‌ఈ సురేంద్ర, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, కార్యదర్శి రాధిక, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి
సీఏఎస్ ఇంటర్వ్యూలు
తిరుపతి సిటీ: ఎస్వీయూలో సోమవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు అధ్యాపకుల ఉద్యోగోన్నతులకు సంబంధించి కేరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. వర్సిటీ పరిపాలనా భవనంలో సెలక్షన్ కమిటీ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 9 మంది ప్రొఫెసర్లు, 21మంది సీనియర్ ప్రొఫె సర్లు ఇంటర్వ్యూలకు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment