స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధం
కేశంపేట: బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు అందె బాబయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుపొందాలంటే గ్రామీణ స్థాయిలో పార్టీని ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి బీజేపీ సభ్యత్వం పొందే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. కార్యకర్తలు అత్యధిక సభ్యత్వలను చేయడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు సులువవుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను బీజేపీ అభ్యర్థులే గెలిచే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రఘురాంగౌడ్, నాయకులు శ్రీనివాస్, నరేందర్‌రెడ్డి, మహేశ్, ఐలయ్య, శ్రీనివాస్, విఠల్‌గౌడ్, నర్సింహ, తిరుపతి, కుమార్‌గుప్తా, గోపాల్‌రెడ్డి, మల్లేశ్, నర్సింగ్, అశోక్‌రెడ్డి, వెంకటేశ్వర్‌జీ పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment