మెనూ పాటించకపోతే చర్యలు
యాలాల: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే కఠిన చర్యలు తప్పవని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూంలో నిల్వ ఉంచిన కూరగాయలను పరిశీలించారు. అక్కడ కొన్ని కుళ్లిన స్థితికి చేరడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వంటలకు వినియోగించే పదార్థాలను తనిఖీ చేశారు. కాగా కేజీబీవీలో తాగునీటి సమస్య ఏర్పడితే బోరు నీటినే తాగుతామని పలువురు విద్యార్థులు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి విషయంలో కేజీబీవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం కేజీబీవీపై అంతస్తులో ఏర్పాటు చేసిన ట్యాంకుల శుభ్రతను స్వయంగా పరిశీలించారు. సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సమయంలో కేజీబీవీ ఎస్‌ఓ మంగమ్మ ఓడీపై వెళ్లడంతో రెండు రోజుల తరువాత కార్యాలయంలో కలవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ అంజయ్య, ఎంఈఓ సుధాకర్‌రెడ్డి, ఆర్‌ఐ సాయిచరణ్ తదితరులు ఉన్నారు.
తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment