రబీ.. రెడీ
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024
8లోu
1నుంచి టాక్సీ,
క్యాబ్ సబ్సిడీల నిలిపివేత
అనంతగిరి: టాక్సీ, మోటారు క్యాబ్ సబ్సిడీలను నిలిపేస్తున్నట్లు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ మహేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీ– ప్రైడ్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ లబ్ధిదారులకు టాక్సీ, మోటార్ క్యాబ్ కింద అందిస్తున్న రాయితీని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిసెంబర్ 1వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కొనుగోలు చేసే వాహనాలకు సబ్సిడీ వర్తించదని తెలిపారు.
ఎన్నికల నిర్వహణపై సమీక్ష
ఇబ్రహీంపట్నం: ఎన్నికల నిర్వహణపై గురువారం డిప్యూటీ కలెక్టర్ (ఎన్నికల సంఘం) చెన్నయ్య ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను వివరించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ఆర్డీఓ అనంత్‌రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎన్నికల నిర్వహణ సిబ్బంది పాల్గొన్నారు.
కరాటే మాస్టర్ చెన్నయ్యను అభినందించిన డీజీపీ
షాద్‌నగర్: షాద్‌నగర్‌కు చెందిన కరాటే మాస్టర్ ఎత్తిన చెన్నయ్యను డీజీపీ జితేందర్ అభినందించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో గురువారం మహిళా పోలీస్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న మాస్టర్ చెన్నయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
మొయినాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ స భ్యుడు, చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్ రామ స్వామి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పెద్దమంగళారంలో పార్టీ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాలు మారినా ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసిందన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, మోహన్‌రెడ్డి, ప్రభాకర్, దర్శన్, హనుమంతు, ఎండీ జహంగీర్, రత్నం, జలీల్ పాల్గొన్నారు.
యాసంగి సాగుకు సిద్ధమవుతున్న కర్షకులు ●
● సాధారణ సాగు విస్తీర్ణం 1,22,593 ఎకరాలు
● ఈసారి సాగు అంచనా 1,44,480 ఎకరాలు
● అందుబాటులో ఎరువులు, విత్తనాలు
● రాయితీకి ఈసారి మంగళమే
వికారాబాద్: రబీ సాగులో రైతన్న రెడీ అయ్యాడు. వేరుశనగ లాంటి విత్తనాలు ఇప్పటికే ప్రారంభించగా శనగ, వరి పంటల సాగుకు సమాయత్తమవుతున్నాడు. ఇదే సమయంలో యాసంగి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉండేలా చూస్తోంది. అయితే రాయితీ విత్తనాలకు ప్రభుత్వం ఈసారి కూడా మంగళం పలికింది. గతంలో వేరుశనగ (పల్లి), శనగ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేసింది. మూడేళ్లుగా వీటికి గుడ్‌బై చెప్పింది. ఈసారి ప్రభుత్వం మారడంతో తమకు సబ్సిడీ విత్తనాలు అందుతాయని ఆశపడ్డ రైతులకు భంగపాటే ఎదురైంది. సర్కారు చేతులెత్తేయడంతో ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వరి విత్తనాల కోసం అవసరమైన ఇండెంట్‌ను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది.
వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరికే మొగ్గు..
జిల్లాలో మొత్తం 2.55 లక్షల మంది రైతులు ఉన్నారు. 5.9 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. 1,22,593 ఎకరాల్లో రబీ పంటలు వేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈసారి సాగు పెరగనుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. సుమారు 1,44,480 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచావేసింది. ఇందులో ఇప్పటి వరకు 16,815 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో జొన్న 906 ఎకరాలు, మొక్కజొన్న 444 ఎకరాలు, శనగ 1,646 ఎకరాలు, వేరుశనగ 12,372 ఎకరాల్లో సాగు చేశారు. రబీ సాగులో వరి పంటదే సింహ భాగం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
అమ్మకాలపై పర్యవేక్షణ
ఈసీజన్‌కు అవసరమైన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంవోపీ (మ్యూరేట్ ఆఫ్ పొటాష్) అందుబాటులో ఉంచారు. మొత్తం 40 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు నివేదించగా, మొదటి విడతలో యాభైశాతం సరఫరా అయ్యింది. ఎరువుల కొరత లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా స్టాక్ అయిపోతే వెంటనే తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని విక్రయించేందుకు లైసెన్సు ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ దుకాణాలకు 130 ఈ– పాస్ యంత్రాలను అందజేయగా, అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు.
న్యూస్‌రీల్
అందుబాటులో ఉన్న ఎరువులు
ఎరువు మెట్రిక్ టన్నుల్లో
యూరియా 6,214
డీఏపీ 1,132
కాంప్లెక్స్ 2,759
అమోనియం పాస్పేట్ 243
సింగిల్ సూపర్ పాస్పేట్ 150
డిసెంబర్ వరకు వేసుకోవచ్చు
రబీ సీజన్‌కు గాను డిసెంబర్ నెలాఖరు వరకు పలు పంటలు వేసుకోవచ్చు. వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో సీజన్ బాగుంటుందని ఆశిస్తున్నాం. సాధారణం కన్నా అధిక విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. రాయితీ విత్తనాల పంపిణీ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. ఎరువులు అవసరమైన మేరకు అందుబాటులో ఉన్నాయి.
– మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి, వికారాబాద్
Comments
Please login to add a commentAdd a comment