జేఎల్‌లో సత్తాచాటిన ‘మ్యాథ్స్ ఎడ్యుకేషనల్ ’
11 మందికి ఉద్యోగాలు
అనంతగిరి: వికారాబాద్‌లోని మ్యాథ్స్ ఎడ్యుకేషనల్ అకాడమీలో శిక్షణ పొందిన 11మంది అభ్యర్థులు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ (మ్యాథ్స్) ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఇనిస్టిట్యూట్ డైరక్టర్ రత్నాకర్ తెలిపారు. మొత్తం 32 మంది ట్రైనింగ్ తీసుకోగా గురువారం విడుదలైన ఫలితాల్లో 11 మంది ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఎంపికై న వారిలో వికారాబాద్ జిల్లా నుంచి సాయికుమార్(26), శ్రీనివాస్(37), శ్రావణ్‌కుమార్(117), వరలక్ష్మి(238), రంగారెడ్డి జిల్లాకు చెందిన రాణి(29), మనీష(39) ఉన్నారు.
విద్యా ప్రమాణాలు
మెరుగుపర్చాలి
జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
తాండూరు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగు పర్చాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని విద్యాధికారి రేణుకాదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు గుణాత్మక విద్య అందించినప్పుడే ఉన్నత పాఠశాల స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధిస్తారన్నారు. ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా బోధన చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో పదిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment