చాలెంజింగ్ జాబ్ పోలీస్
పరేడ్ నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు
అనంతగిరి: పోలీస్ అంటే చాలెంజింగ్ జాబ్ అని మల్టీజోన్– 2 ఐజీ వి.సత్యనారాయణ అన్నారు. వికారాబాద్‌లోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో గురువారం 2024 బ్యాచ్‌కు చెందిన 271 మంది ఏఆర్ ఎస్‌సీటీపీసీల (స్టైపెండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్) దీక్షాంత్ (పాసింగ్ అవుట్) పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. వీరంతా తొమ్మిది నెలల పాటు ఇక్కడ శిక్షణ పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐజీకి ఘన స్వాగతం పలికారు. రామగుండం నుంచి 119 మంది, సిద్దిపేట నుంచి 60, కొమురంభీం ఆసిఫాబాద్ నుంచి 58 మంది, మహబూబాబాద్ నుంచి 34 మంది పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. డీటీసీ ప్రిన్సిప్ మురళీధర్ వీరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. తెలంగాణ ఊటీగా పేరు పొందిన వికారాబాద్‌లోని శిక్షణ కేంద్రంలో విజయవంతంగా ప్రాథమిక శిక్షణ ముగించుకున్న 271 మంది అభ్యర్థులలో అందరూ, అన్ని పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఇందుకు ఎంతో కష్టపడిన అధికారులు, సిబ్బంది ఇండోర్, ఔట్ డోర్ ఫ్యాకల్టీని అభినందించారు. విధుల్లో చేరిన ప్రతిఒక్కరూ రాజ్యాంగబద్ధంగా, క్రమశిక్షణతో ప్రజలకు సేవ చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటైనదే పోలీసు వ్యవస్థ అని తెలిపారు. ప్రజల రక్షణ, వారి హక్కులు, ఆత్మగౌరవం మన బాధ్యత అని స్పష్టంచేశారు. పోలీసులకు ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని తెలిపారు.
బహుమతుల ప్రదానం
అనంతరం బెస్ట్ ఇండోర్‌గా ఎస్.నాగేందర్, బెస్ట్ ఔట్ డోర్, బెల్ట్ ఆల్ రౌండర్‌గా ఎల్.సురేష్, బెస్ట్ ఫైరర్‌గా ఓ.వినోద్‌కుమార్‌కు బహుమతులు అందజేశారు. ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీలు విజయ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, ఏఓ జ్యోతిర్మణి, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాలి
మల్టీజోన్– 2 ఐజీ సత్యనారాయణ
271 మంది ఏఆర్ ఎస్‌సీటీపీసీల అవుట్ పరేడ్
ప్రశాంత వాతావరణం
మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే వికారాబాద్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. యూనిఫాంపై మక్కువతో పోలీసు శాఖలో చేరా. ట్రైనింగ్‌లో నేర్చుకున్న ప్రతీ అంశాన్ని విధుల్లో పాటిస్తా.
– జి.అజయ్‌కుమార్
ఎంతో ప్రోత్సహించారు
నేను ఇంటర్ వరకు చదివా.. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ వచ్చింది. శిక్షణ కాలంలో కొతం కష్టం అనిపించినా.. శిక్షకులు, అధికారులు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అంశాల్లో ట్రైనింగ్ ఇచ్చారు.
– బి.నితిన్
Comments
Please login to add a commentAdd a comment