రైతులకు అండగా ఉంటాం
చేవెళ్ల: రైతులు పండించిన పత్తిని మొత్తం సీసీఐ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని దామరగిద్ద సమీపంలో ఉన్న శ్రీనివాస కాటన్ మిల్లు వద్ద గురువారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. రైతులు పండించిన ధాన్యం, పత్తిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. చేవెళ్లలో పత్తి కొనుగోలు కేంద్రం, శంకర్‌పల్లి, షాబాద్‌లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎలాంటి కొర్రీలు పెట్టుకుండా మద్దతు ధరలు అందించాలని ఆదేశించారు. పత్తి మద్దతు ధర రూ.7,200ల నుంచి 7,400 వరకు ఉంటుందన్నారు. రైతులు దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ముధుసుదన్‌రెడ్డి, చేవెళ్ల ఏఎంసీ చైర్మన్ పెంటయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు డి.వెంకట్‌రెడ్డి, గోనే ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, సీసీఐ ప్రతినిధి రాజీవ్, పత్తి మిల్లు యజమాని రమేశ్‌కుమార్, మార్కెట్ కార్యదర్శి మహేందర్, వ్యవసాయ అధికారి శంకర్‌లాల్, డైరెక్టర్లు మల్లేశ్, నరేందర్, జనార్దన్, నాయకులు రాములు, శ్రీనివాస్‌గౌడ్, మధుసుదన్‌రెడ్డి, శంకర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్లలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment