దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
దోమ: ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు దశరథ్ డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని కొండాయపల్లి గ్రామంలో రెండో రోజు దివ్యాంగులతో కలిసి తమ సమస్యలను పరిష్కరించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను విస్మరిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయడంలో విఫలం అవుతుందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రూ.6 వేల పెన్షన్‌ను ఇస్తామని, నేటికీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే వరకు తాము గ్రామ గ్రామాన తిరుగుతూ పోరాటం చేస్తామన్నారు. డిసెంబర్ 9వ తేదీ వరకు పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రం ఇస్తూనే ఉంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు దశరథ్
Comments
Please login to add a commentAdd a comment