ఓటు ఎంతో విలువైనది
అనంతగిరి: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కు పొందాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్‌టీఆర్ చౌరస్తా వరకు 2కే రన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మరి రివిజన్ 2025లో భాగంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమన్నారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఓటు ఎంతో అమూల్యమైనదని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, స్వీప్ నోడల్ ఆఫీసర్ ఎంఏ సత్తార్, డీఎస్‌పీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద రంగోలి
స్వీప్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట మెప్మా, గురుకుల పాఠశాలల విద్యార్థినులు, సెర్ఫ్ మహిళా సంఘాల సభ్యులతో రంగోలి కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, విద్యార్థులు చక్కటి ముగ్గులు వేశారు. వీటిని కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, స్వీప్ నోడల్ ఆఫీసర్ సత్తార్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, మెప్మా పీడీ రవికుమార్, డీఈఓ రేణుకాదేవి, డీపీఓ జయసుధ, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లేశం, ఆర్డీఓ వాసుచంద్ర, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కు అందరి బాధ్యత
కొడంగల్ రూరల్: ఓటు హక్కు పొందడం బాధ్యతగా భావించి.. 18ఏళ్లు నిండిన యువత ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. మంగళవారం పట్టణంలోని అంగడిబజార్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు, యువకులు, అధికారులతో కలిసి 2 కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, ఎంఈఓ రాంరెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్
ఓటు హక్కుపై 2కే రన్
పాల్గొన్న అధికారులు, విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment