మహిళల ఉపాధి కోసం
బషీరాబాద్: మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా మండలంలో చిన్నతరహా పరిశ్రమ నెలకొల్పుతామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం రూ.50 కోట్లు అవసరమైనా మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని మంతట్టి గ్రామంలో రూ.30 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రూ.1.20 కోట్ల రుణ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. డిసెంబరులో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రైతు భరోసా, రైతు బీమా, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.
త్వరలో తాండూరుకు సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే తాండూరు అభివృద్ధికి వందల కోట్లు తెచ్చానని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. రూ. 200 కోట్లతో దౌలాపూర్ వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించనున్నట్లు చెప్పారు. వికారాబాద్ – తాండూరు రోడ్డు అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. జీవన్గీ – కరణ్‌కోట్, బషీరాబాద్‌లో 30 పడకల ఆస్పత్రి మంజూరు చేయించానని అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో నిధులు లేకున్నా శిలాఫలకాలు వేశారని ఆరోపించారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అంతకుముందు ఐకేపీ ద్వారా శ్రీనిధి రుణాలతో ఏర్పాటు చేసిన పలు షాపులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన రాజ్యంగ దినోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కరుణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి, బషీరాబాద్, తాండూరు మార్కెట్ కమిటీల చైర్మన్లు మాధవరెడ్డి, బాల్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు శంకర్‌రెడ్డి, సురేష్, మహేందర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు, లక్ష్మణ్‌రావు, మాపిక్‌రెడ్డి, శ్రీధర్, తహసీల్దార్ వెంకటేశం, ఎంపీడీఓ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డ్వాక్రా మహిళలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తాం
రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల
తాండూరు – వికారాబాద్ రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరు
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment