ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్ష
అనంతగిరి: ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల అప్‌లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ పాల్గొన్నారు. వీరు పరిగి తహసీల్దార్ కార్యాలయం నుంచి హాజరయ్యారు. కలెక్టరేట్ నుంచి ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, హౌసింగ్ అధికారులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలనలో వచ్చిన ఇళ్ల దరఖాస్తు అప్‌లోడ్ ప్రక్రియ, వసతి గృహాల్లో వసతులు, గ్రూప్–2 పరీక్షల నిర్వహణ తదితరల అంశాలపై మంత్రి సూచనలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment