సారూ.. మాకు న్యాయం చేయండి
కొడంగల్: ‘సారూ.. మాకు న్యాయం చేయండి’ అంటూ మండలంలోని అప్పాయిపల్లి గ్రామ రైతులు బుధవారం తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. అప్పాయిపల్లి సర్వే నంబర్ 19లో ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం స్థలం సేకరించించారు. రైతుల వద్ద భూములు తీసుకొని ఎకరాకు రూ.10 లక్షలు, ఒక ప్లాట్, ఒక ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం తమకు పరిహారం అందలేదని రైతులు ఆరోపించారు. నాలుగు నెలల క్రితం రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నారని, ఇప్పటి వరకు పూర్తిగా పరిహారం చెల్లించలేదన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం ఇచ్చి న భూముల్లో ఎలాంటి పనులు చేపట్టరాదని రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. అలాగే పూర్తి పరిహారం ఇవ్వాలని విన్నవించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పకీరప్ప, మోతీబాయి, రాములు గౌడ్, వెంకటమ్మ, మల్లప్ప, శేఖర్, కిష్టప్ప, బసప్ప, వెంకటప్ప, సంగప్ప, బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్‌ను కోరిన అప్పాయిపల్లి రైతులు
Comments
Please login to add a commentAdd a comment