లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Published Thu, Dec 12 2024 8:20 AM | Last Updated on Thu, Dec 12 2024 8:20 AM

లోక్‌

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

అనంతగిరి: లోక్‌ అదాలత్‌లను కక్షిదారులు సద్వి నియోగం చేసుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ నెల 14న వికారాబాద్‌లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను రాజీ చేసుకోవచ్చని తెలిపారు. లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు.

నేడు, రేపు జిల్లా స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణ పరిధిలోని కొత్తగడి గురుకుల పాఠశాలలో గురు, శుక్రవారాల్లో జిల్లాస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌, ఇన్‌స్పైర్‌ ప్రదర్శన (2023–24) నిర్వహించనున్నట్లు డీఈఓ రేణుకాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు ఉప అంశాల్లో నూతన ఆవిష్కరణలతో పాల్గొనవచ్చని తెలిపారు. టీచర్‌ ఎగ్జిబిట్స్‌లో నూతన బోధనాభ్యసన సామగ్రిని ప్రదర్శించవచ్చని తెలిపారు. డీఎస్‌, బీఎడ్‌ విద్యార్థులు సైతం ప్రదర్శించవచ్చన్నారు. గురువారం సాయంత్రం మిల్లెట్స్‌ ఫర్‌ సస్టెనబుల్‌ ఫ్యూచర్‌, హెల్త్‌ అనే అంశంపై సెమినార్‌ ఉంటుందన్నారు. జూనియర్‌ (6, 7, 8), సీనియర్‌(9, 10) విభాగాల్లో ప్రతి ఉప అంశానికి ఒకరు చొప్పున ఒక పాఠశాల నుంచి అత్యధికంగా 14 ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఒక పాఠశాల నుంచి ఒక గైడ్‌ టీచర్‌ మాత్రమే పాల్గొనాలని తెలిపారు. ఇన్‌స్పైర్‌కు ఎంపికై న పాఠశాలలు ఇందులో పాల్గొనరాదని సూచించారు.

క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ దూరం

జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్‌ రవీంద్రయాదవ్‌

కొడంగల్‌ రూరల్‌: క్షయ సోకిన వ్యక్తులు క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి నయం అవుతుందని జిల్లా క్షయ నియంత్రణ అధికారి, డిపూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రవీంద్రయాదవ్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో క్షయవ్యాధిపై వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తూ రోగులను గుర్తించి మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వ్యాధి సోకిన వ్యక్తులు భయాందోళనకు గురికారాదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చే మందులను క్రమంగా వాడాలని సూచించారు. 130 మందికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి క్షయ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. వారి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ విద్యప్రియ, డాక్టర్‌ సాకేత్‌, డాక్టర్‌ జ్యోతి, సూపర్‌వైజర్లు ఎండీ రఫీ, మధుసూదన్‌రెడ్డి, రాహత్‌, టీబీ అలర్ట్‌ ఇండియా సభ్యులు సాయి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి రాష్ట్రస్థాయి లగోరి పోటీలు

అనంతగిరి: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ సృజన ఉన్నత పాఠశాలలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు 8వ రాష్ట్ర స్థాయి సీనియర్‌ లగోరి మీట్‌ నిర్వహించనున్నట్లు లగోరి అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సదానందరెడ్డి, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం వారు వికారాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు వస్తారని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు అమరేందర్‌రెడ్డి, శివరాజుగౌడ్‌, రమేష్‌కుమార్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి 
1
1/3

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి 
2
2/3

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి 
3
3/3

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement