సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వేను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా, పూర్తి పారదర్శకంగా జరిగేలా చూస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, గ్రూప్–2 పరీక్షల నిర్వహణ, నూతన డైట్ మెనూ ప్రారంభోత్సవం, సంక్షేమ హాస్టళ్ల తనిఖీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడారు. మండల స్థాయి నుంచి ఇద్దరు, మున్సిపాలిటీల నుంచి నలుగురు చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని సూచించారు.
రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment