జేబు దొంగలతో జాగ్రత్త
మోమిన్‌పేట: బస్సులో ప్రయాణించే సమయంలో జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్‌ఐ పుండరీకం పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆర్‌టీసీ బస్టాండులో ప్రయాణికులకు చోరీలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బస్సు ఎక్కే, దిగే సమయంలో ప్రయాణికులు సెల్‌ఫోన్, బంగారు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. గుర్తు తెలియని ఆటోలో ఒంటరిగా మహిళలు ప్రయాణించవద్దన్నారు. పొలాలకు వెళ్లే సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను వేసుకోవద్దని సూచించారు. ఇంటికి తాళం వేసి రాత్రికి ఎక్కడికి వెళ్లకూడదన్నారు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే ఇంటి పక్కన వారికి చెప్పి వెళ్లాలన్నారు. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోయిన వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ దత్తాత్రి తదితరులు ఉన్నారు.
ఏఎస్‌ఐ పుండరీకం
Comments
Please login to add a commentAdd a comment