వా‘నర’ సాయం | - | Sakshi
Sakshi News home page

వా‘నర’ సాయం

Published Thu, Dec 12 2024 8:18 AM | Last Updated on Thu, Dec 12 2024 8:18 AM

వా‘నర’ సాయం

వా‘నర’ సాయం

ధారూరు: ఒకప్పుడు మనుషులను చూస్తేనే కోతులు పారిపోయేవి. ప్రస్తుతం కోతులను చూస్తే మనుషులు పరుగు తీసే పరిస్థితులు వచ్చాయి. దీంతో ఎవరూ వాటి దగ్గరికి వెళ్లేందుకు సాహసించడం లేదు. మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో బుధవారం సాయంత్రం విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఓ కోతి షాక్‌కు గురై కింద పడిపోయింది. స్పృహ కోల్పోయిన మర్కటాన్ని గమనించిన స్థానికుడు ఉస్మాన్‌ వానరాన్ని పట్టుకుని సపర్యలు చేశాడు. కాళ్లు, చేతులు రుద్దడంతో కొద్దిసేపటికి తేరుకుంది. దీంతో ఓ గిన్నెలో నీళ్లు తెచ్చి తాగించాడు. అనంతరం ఉస్మాన్‌ వైపు కృతజ్ఞతగా చూస్తూ.. కోతి తన గుంపులో కలిసి వెళ్లిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement