ఘనంగా గీతా జయంతి
అనంతగిరి: వికారాబాద్ పట్టణం శివాజీనగర్ మైసమ్మ కట్టపై ఏకాదశిని పురస్కరించుకుని గీతా వాహిణి ఆధ్వర్యంలో గీతా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం గీతాయజ్ఞం, సామూహిక గీతా పారాయణం గావించారు. ఈ కార్యక్రమంలో గీతావాహిణి వికారాబాద్ అధ్యక్షురాలు శ్రీదేవి సదానంద్‌రెడ్డి పాల్గొన్నారు.
భగవద్గీత కంఠస్థ పోటీలు
టీటీడీ–హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గీతాజయంతిని పురస్కరించుకుని వికారాబాద్‌లోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. న్యాయ నిర్ణేతలుగా గీతావాహిని ప్రతినిధులు శ్రీదేవి, లావణ్య, మమత, దివ్య వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్ గూడూరు హరినాథ్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు చండీశ్వర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, బల్వంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్‌లో..
కొడంగల్ రూరల్: పట్టణంలోని శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం ఆలయ ధర్మకర్తలు, హిందూ ధార్మిక సేవా సభ్యులు భక్తిశ్రద్ధలతో గీతా జయంతి నిర్వహించారు. ఉదయం 10 గంటలకు గీతా పారాయణం, దేవాలయంలో స్వామివారికి అభిషేకం, శ్రీకృష్ణ భగవాన్‌కు, భగవద్గీతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 18 అధ్యాయాలు పారాయణం చేశారు.
దోమలో..
దోమ: కొత్తపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ కుంట రాములు గీతా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు కృష్ణ స్వామితో గీతాపారాయణం, విష్ణుసహస్త్రనామం, హనుమాన్ చాలిసాతో యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు.
ఘనంగా గీతా జయంతి
ధారూరు: మండల కేంద్రంలోని శ్రీపాండురంగస్వామి దేవాలయంలో బుధవారం పూజారి కుమా రస్వామి ఆధ్వర్యంలో మహిళలు గీతా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భగవద్గీతా పుట్టిన రోజును పురస్కరించుకుని గ్రామంలోని మహిళలు శ్రీపాండురంగస్వామి దేవాలయానికి చేరుకుని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
Comments
Please login to add a commentAdd a comment