జర్నలిస్టులపై దాడి హేయం
పరిగి: జర్నలిస్టులపై దాడి చేసిన నటుడు మోహన్‌బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టులపై మోహన్‌బాబు దాడి చేయడంతో పరిగి జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం పరిగి బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్ట్‌పై దాడి చేయడం సమంజసం కాదన్నారు. మీడియాపై నటుడు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. రోజు రోజుకు జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సినీనటుడు మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాండూరులో జర్నలిస్టుల నిరసన
తాండూరు టౌన్: న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు అకారణంగా దాడి చేయడం హేయనీయమని పలువురు జర్నలిస్టులు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని అంబేడ్కర్ చౌక్‌లో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. కాగా బీజేపీ నేతలు జర్నలిస్టులకు మద్ధతు తెలిపారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి సమస్యల పరిష్కారంలో వారధిగా ఉండే జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. నిరసనలో జేజేపీ నేతలు రమేష్‌కుమార్, భద్రేశ్వర్, లలిత, శ్రీలత, మల్లేశం, జర్నలిస్టులు వేణుగోపాల్ రెడ్డి, శాంతు, వెంకట్రామ్ రెడ్డి, ఆర్‌వీ రెడ్డి, శివానంద్, నవీన్, కృష్ణ, శ్రీను, కుమార్, వెంకట్, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.
నటుడు మోహన్‌బాబుపై
చర్యలు తీసుకోవాలి
జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో
బస్టాండ్ ఎదుట ధర్నా
Comments
Please login to add a commentAdd a comment