గణితంపై పట్టు సాధించాలి
అనంతగిరి: కష్టంతో కాకుండా ఇష్టంతో గణితాన్ని నేర్చుకోవాలని తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు చిగుళ్లపల్లి వేణుగోపాల్ సూచించారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జిల్లా స్థాయి గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు గణితం పట్ల భయం పోయేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. విద్యార్థులు కూడా గణితం అంటే భయాన్ని వీడి ఇష్టంతో చదవాలన్నారు. గణితాన్ని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టేనని పేర్కొన్నారు. ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశామన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. అనంతరం ఇటీవల రాష్ట్ర స్థాయిలో జ్ఞాన నంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పిలిగుండ్ల గణిత ఉపాధ్యాయుడు ఎండీ.మోసిన్‌ను జిల్లా గణిత ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశం, ఉపాధ్యాయులు రవీందర్‌రెడ్డి, వీరేశం, శశిధర్, బసప్ప, అనిల్‌కుమార్, జగదీశ్వరి, రాఘవేందర్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశం, యశోద, నిర్మల, బాలకుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర స్థాయికి ఎంపికై న వారు
శ్రీజ (కుల్కచర్ల), సారా బేగం, అక్షర (చన్గోముల్), ఎం.రిషిక (హస్నాబాద్), పి.రాధిక (తట్టేపల్లి), ఎం.మురళి (ఎన్కతల), బి.ఈశ్వర్ (కుల్కచర్ల, గురుకులం), డి.హరిణి (వికారాబాద్, సంగం లక్ష్మీబాయి), కె.హారిక (పరిగి, మోడల్ స్కూల్) రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యారు.
తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం
జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్
Comments
Please login to add a commentAdd a comment